Wednesday, January 22, 2025

అబిడ్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Mass National Anthem will be organized at Abids

జాతీయ గీతాలాపనలో పాల్గొననున్న సిఎం కెసిఆర్
ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు ఆంక్షలు

మనతెలంగాణ, హైదరాబాద్: అబిడ్స్‌లోని జిపిఓ సర్కిల్ పరిసరాల్లో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం అబిడ్స్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు అబిడ్స్ పరిసరాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని కోరారు.

లిబర్టీ, బషీర్‌బాగ్ నుంచి బిజేఆర్ సిర్కిల్ వైపు వచ్చే వాహనాలను అబిడ్స్ వైపు అనుమతించరు. బిజేఆర్ సర్కిల్ నుంచి ఎఆర్ పెట్రోల్ పంప్ నుంచి నాంపల్లి స్టేషన్ వైపు మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి బిజేఆర్ సర్కిల్ వైపు వచ్చే ఆర్టిసి బస్సులు లిబర్టీ, హిమయత్‌నగర్, నారాయణగూడ, కాచిగూడ, కోటి వైపు మళ్లిస్తారు.

కింగ్‌కోఠి నుంచి అబిడ్స్ మెయిన్ రోడ్డు వైపు వాహనాలను అనుమతించరు. కింగ్ కోఠి ఎక్స్ రోడ్డు మీదుగా హనుమాన్ టికిడి, ట్రూప్ బజార్, కోటి వైపు మళ్లిస్తారు.
బొగ్గుల కుంట నుంచి అబిడ్స్ మెయిన్ రోడ్డు వచ్చే వాహనాలను బొగ్గులకుంట ఎక్స్ రోడ్డు మీదుగా హనుమాన్ టికిడీ, ట్రూప్‌బజార్, కోఠి వైపు మళ్లిస్తారు.
పిసిఆర్ నుంచి బిజేఆర్ సిర్కిట్ వైపు వచ్చే వాహనాలను ఎఆర్ పెట్రోల్ పంప్ మీదుగా నాంపల్లి రోడ్డు వైపు వెళ్లాలి.
సోమాజిగూడ, ఖైరతాబాద్, రవీంధ్రభారతి జంక్షన్, అసెంబ్లీ, ఎల్‌బి స్టేడియం, బిజేఆర్ స్టాట్యూ, లిబర్టీ, హిమయత్‌నగర్, జిపిఓ అబిడ్స్, ఎంజే మార్కెట్, నాంపల్లి పరిసరాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకు ట్రాఫిక్ రద్ధి అధికంగా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

పార్కింగ్ ప్రాంతాలు….

జాతీయ గీతాలాపనలో పాల్గొనే వారు నిజాం కాలేజీ గ్రౌండ్, తాజ్‌మహల్ నుంచి కింగ్ కోఠి ఎక్స్ రోడ్డు, బాటా నుంచి బొగ్గుల కుంట ఎక్స్ రోడ్డు, జిహెచ్‌ఎంసి ఆఫీస్, రామకృష్ణా థియేటర్, జార్జ్ గ్రామర్ స్కూల్.
అబిడ్స్ సర్కిల్ నుంచి ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్ నుంచి వచ్చే వాహనాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అన్నపూర్ణ హోటల్ రోడ్డు వైపు పార్కింగ్ చేయాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News