Thursday, January 23, 2025

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

- Advertisement -
- Advertisement -

Mass rape of a minor girl in UP

కాపాడాల్సిన పోలీసే మళ్లీ కాటేశాడు
యుపిలో దారుణం.. ఐదుగురి అరెస్టు

లలిత్‌పూర్(యుపి): ఒక 13 ఏళ్ల బాలికపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులు బాధితురాలిని పోలీసు స్టేషన్‌లో వదిలిపెట్టి పరారుకాగా ఆ పోలీసు స్టేషన్ అధికారి(ఎస్‌హెచ్‌ఓ) సైతం ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన దారుణ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పాలి పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణ సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి బంధువైన ఒక మహిళపాటు ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. ఎస్‌హెచ్‌ఓ పరారీలో ఉండగా ఆ పోలీసు స్టేషన్‌లో పనిచేసే సిబ్బందినందరినీ అక్కడి నుంచి తప్పించి పోలీసు లైన్స్‌కు పంపించివేశారు.

ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి నివేదికను సమర్పించవలసిందిగా ఝాన్సీ డిఐజి జోగేంద్ర కుమార్‌ను ప్రభుత్వం ఆదేశించింది. బాధితురాలి తల్లి కథనం ప్రకారం ఏప్రిల్ 22న నలుగురు వ్యక్తులు ఇక్కడకు 240 కిలోమీటర్ల దూరంలోని భోపాల్ తీసుకెళ్లి మూడు రోజుల పాటు అత్యాచారం జరిపారు. బాధితురాలిని పాలి పోలీసు స్టేషన్‌లో నిందితులు వదిలిపెట్టి వెళ్లగా అక్కడ కూడా ఆమెపై లైంగిక దాడి జరిగింది. తనపై జరిగిన సామూహిక అత్యాచారం, ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో జరిగిన లైంగిక దాడి గురించి బాధితురాలు ఒక ఎన్‌జిఓకు తెలియచేసింది. దీన్ని ఆధారం చేసుకుని మంగళవారం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పాలి ఎస్‌హెచ్‌ఓను సస్పెండ్ చేసి మిగిలిన సిబ్బందిని పోలీసు లైన్స్‌కు తరలించామని అడిజి భాను భాస్కర్ తెలిపారు. కాగా..ఈ దారుణ సంఘటనపై ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా స్పందించాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆ పార్టీలు ఆరోపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News