Thursday, November 21, 2024

హన్మకొండలో మూకుమ్మడి తీర్మానాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హన్మకొండ ప్రతినిధి : సాధించి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధే విజయానికి తొలిమెట్టు అవుతున్నది. ఎక్కడ చూసినా మూకుమ్మడి తీర్మానాలు, కుల సంఘాలు, రైతు సంఘాలు, యువజన సంఘాలు ఇలా ఎన్నో సంఘా లు సంఘటితమై రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చిన వారికే పట్టం కట్టాలని దృఢ సంకల్పంతో ఒకటవుతున్నారు. రాష్ట్రాభివృద్ధి అంటే ఏ ఒక్క వర్గం అని కాకుండా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రణాళికలు చేసి అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వానికి మళ్లీ మళ్లీ పట్టం కట్టాలని ఏక తీర్మానాలే నిదర్శనం. చెరువుల మరమ్మతులు చేసుకొని రెండు పంటలకు నీరు సమకూర్చుకొని రైతును రాజు చేసిన ప్రభుత్వాన్ని మరువకూడదని తీర్మానం.

చెరువుల పూడిక, కట్ట మరమ్మతులు, కాకతీయ కాలువ ద్వారా చెరువులు నింపుకొని వర్షానికి ఎదురు చూడకుండా ధైర్యంగా రెండు పంటలు పండటానికి కారకులైన ప్రభుత్వానికి మళ్లీ పట్టం కట్టాలని తీర్మానం. పంట సాగుచేసే రైతుకు సమయానికి రైతు బంధు అందించి ఆదుకునే ప్రభుత్వానికి అండగా తీర్మానం. రైతు కరంటుకు ఎదురు చూడకుండా నిత్యం 24 గంటలు కరంటు ఇచ్చి, అది ఉచితంగా రైతులకు అందజేసే ప్రభుత్వానికి మరకూడదని తీర్మానాలు. దళిత కుటుంబాలు ఆనందాలు పంచడానికి దళిత బంధు పేరుతో ఏకంగా రూ. 10 లక్షల ఆర్థికసాయం చేస్తున్న భుత్వానికి దళితులు అండగా తీర్మానాలు. ప్రతీ జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలతోపాటు ప్రభుత్వాసుపత్రిలో పడకల సంఖ్య పెంచుతూ ప్రతీ పేదవాడికి కార్పోరేటు వైద్యం అందేలా కృషి చేసిన ప్రభుత్వానికి చేతులు కలుపుతున్న యువకులు, వృద్ధులు. ప్రతీ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌లు ఏర్పాటుచేసి చదువుకున్న యువతను విదేశాలకు వెళ్లకుండా సొంత జిల్లాలోనే ఐటీ ఉద్యోగాలు చేసుకునేలా చేసి యువతకు నిరుద్యోగ సమస్య తీరుస్తున్న ప్రభుత్వానికి అండగా మేము సైతం అని ముందుకు సాగి తీర్మానాలు.

కుల సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నేరుగా వారి అభివృద్ధికి బాసటగా నిలిచి ఏకంగా అధిక మొత్తంలో అప్పులేని డబ్బులు ఇచ్చి కుల సంఘాలు తలెత్తుకునేలా చేసిన ప్రభుత్వానికి సై అని తీర్మానాలు. తెలంగాణ అంటే పచ్చని పైర్లు రోడ్డు ఇరువైపులా వృక్షాలు ఎల్లపుడు చల్లగా ఉండే విధంగా చెట్లను నాటుకొని రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేసిన వారికి అండగా తీర్మాణాలు.

ఎల్లపుడు రాష్ట్రం లో పచ్చని పొలాలతో పాడి పంటలతో నిత్యం ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటుచేసి అందరి మన్ననలను మైమరిపించే విధంగా రాష్ట్రా న్ని సస్యశ్యామలం చేసిన వారికి అండగా తీర్మానాలు. తెలంగాణ అంటే ఆట పాట అని బతుకమ్మ ప్రపంచానికి చాటి చెప్పి విదేశాల్లో సైతం బతుకమ్మ ఆట ఆడుకునే విధంగా బతుకమ్మ ప్రాధాన్యత, ప్రాముఖ్యతను చాటి చెప్పిన వారికి అండగా తీర్మానాలు. ఇలా గత తొమ్మిది సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్‌ఎస్ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాల్లో మూకుమ్మడి తీర్మానాతో స్వాగతం పలికి వారి విజయాలకు దోహదపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News