Sunday, December 22, 2024

సెర్బియాలో మరో దారుణం..

- Advertisement -
- Advertisement -

బెల్‌గ్రేడ్ : సెర్బియాలో ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనమండుగురు మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో ఇది రెండవ సామూహిక మారణకాండ అయింది. సెర్బియాలోని మ్లదెనోవాక్ సమీపంలోని మూడు గ్రామాలను ఎంచుకుని సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఎనమండుగురు చనిపోగా, 14 మంది గాయపడ్డారని రాత్రంతా జరిపిన గాలింపు చర్యల్లో శుక్రవారం తెల్లవారు జామున ఓ అనుమానితుడు అరెస్టు అయ్యాడని అధికారులు తెలిపారు.

ఇప్పటి దాడి మొత్తం జాతిపై జరిగిన అమానుషం అని సెర్బియా ప్రెసిడెంట్ అలెగ్జాండర్ వుసిక్ స్పందించారు. రాజధాని బెల్‌గ్రేడ్‌లో రెండురోజుల క్రితం ఓ 13 ఏండ్ల విద్యార్థి తన తండ్రి గన్ తీసుకుని జరిపిన కాల్పుల్లో ఎనమండుగురు తోటి విద్యార్థులు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News