- Advertisement -
వాషింగ్టన్ : అమెరికాలో విచ్చలవిడి కాల్పుల దారుణాలు ఎక్కువయ్యాయి. కొత్త సంవత్సరం 2024 ఆరంభం అయిన నాలుగు రోజుల్లోనే దాదాపు 400 మంది వరకూ ఈ అకృత్యాల్లో బలి అయ్యారని ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో నిర్థారణ కాని వార్తలతో స్పష్టం అయింది. ఈ పరిణామంపై అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా స్పందించారు. ఇటువంటి ఘటనలు బాధాకరం అని తెలిపిన ఆమె వీటిని ఏ విధంగా నివారించాలో తమకు తెలుసునని చెప్పారు. విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. ఆయుధ నిషేధాన్ని పునరుద్ధరిస్తామని ఇక ఎక్కడా ఇటువంటి బలులు ఉండకుండా చేస్తామని తెలిపారు. జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, మాల్స్ ఎంచుకుని కొందరు కాల్పులకు తెగబడుతున్నారు. వీరు ఉన్మాద రీతిలో ఇతరుల ప్రాణాలు తీయడం తమకు ఆటగా భావించుకుంటున్నారని ఉపాధ్యక్షురాలు స్పందించారు.
- Advertisement -