Wednesday, January 22, 2025

ఆ ఒక్క నిమిషం.. మార్మోగిన జనగణమన

- Advertisement -
- Advertisement -

ఉద్వేగభరితంగా సాగిన కార్యక్రమం
హైదరాబాద్ అబిడ్స్‌లో సిఎం కెసిఆర్, మంత్రులు, ఎంపిల గానం
పల్లె, పట్టణాల్లో ఉత్సాహంగా పాల్గొన్న జనం
ఉ.11.30గంటలకు స్తంభించిన రాష్ట్రం 
ఎక్కడి వాహనాలు అక్కడే
వాహనాలు దిగి జాతీయ గీతాన్ని ఆలపించిన పలువురు ప్రముఖులు
పొలాల్లోనూ, కల్యాణమండపాల్లోనూ వినిపించిన జనగణమన విద్యాసంస్థల్లో పెల్లుబికిన దేశభక్తి

సామూహిక జాతీయ గీతాలాపనతో యావత్ తెలంగాణ పులకించిపోయింది. గుండెల నిండా దేశభక్తి నింపుకొని చిన్నా పెద్ద్దా తేడా లేకుండా సకల జనులు గొంతు కలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని జనంలో జోష్ నింపారు. ఇల్లు, వాకిలి, బడి, గుడి, పొలం, పెళ్లి మండపం ఇలా ప్రతి చోటా జనగణమన మార్మోగింది. ఆ ఒక్క నిమిషం రాష్ట్రం నాలుగు చెరుగులా ప్రతిధ్వనించింది. అంతా ఏకమై ముక్తకంఠంతో జాతీయ గీతాన్ని ఆలపించారు.

మన తెలంగాణ/హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. ప్రజలంతా ఒకేచోట ఏకమై జనగణమన గీతాన్ని ఆలపించారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంటే ఒకే గొంతుకలో వినిపించిన జాతీయ గీతంతో తెలంగాణం మురిసిపోయింది. హైదరాబాద్ అబిడ్స్‌లోని నెహ్రూ సర్కిల్‌లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వజ్రోత్సవ కమిటీ చైర్మన్ ఎంపి కేశవరావు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బేతి సుభాష్ రెడ్డి, ఏ.జీవన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు, పలు సంస్థల చైర్మన్లు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
నెహ్రూ విగ్రహానికి పుష్పాంజలి
ముందుగా ఆబిడ్స్ చౌరస్తాలోని నెహ్రూ విగ్రహం వద్దకు సిఎం కెసిఆర్ చేరుకున్నారు. 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేళ, శాంతి పావురాన్ని ఎగరవేస్తున్న ప్రధాని నెహ్రూ విగ్రహానికి సిఎం కెసిఆర్ పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ గుమికూడిన వేలాది మంది ప్రజలకు సిఎం కెసిఆర్ అభివాదం చేశారు. అనంతరం వేదికమీదకు చేరుకున్నారు. వేదికమీద నుంచి నిర్ధేశిత సమయం (11.30 గంటలకు) ‘సామూహిక జాతీయ గీతాలాపన’ కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. సిఎంతో పాటు వేదిక మీద వున్న కె.కేశవరావుతో సహా పలువురు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, సిఎస్ సహా ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు.
జై…జై తెలంగాణ అంటూ పిడికిలెత్తి నినదించిన సిఎం కెసిఆర్
చౌరస్తాకు నలుదిక్కులా, పలు అంతస్థుల భవనాల మీద నుంచి ఈ దృశ్యాలను తిలకిస్తున్న వేలాది మంది జన సమూహం, సిఎం కెసిఆర్ గొంతుతో కలిపి ముక్త కంఠంతో ‘జనగణమన అధినాయక జయహే’ అంటూ ఏకోన్ముఖులై జాతీయ గీతాన్ని ఆలపించారు. దాంతో ఆబిడ్స్ నెహ్రూ చౌక్ జాతీయ గీతాలపనతో ప్రతిధ్వనించింది. ఆ ప్రాంతమంతా దేశభక్తి ఉప్పొంగింది. ‘బోలో స్వతంత్ర భారత్ కీ జై’ నినాదంతో నెహ్రూ చౌరస్తా ప్రాంగణం మారుమోగింది. గీతాలాపన ముగియగానే జై భారత్.. భారత్ మాతా కీ జై…జై తెలంగాణ అనే నినాదాలు చేస్తూ సిఎం కెసిఆర్ పిడికిలెత్తి నినదించారు. నెహ్రూ విగ్రహం సాక్షిగా సిఎం కెసిఆర్‌తో వేలాది గొంతులు.. ‘భారత్ మాతాకీ జై…’ అంటూ ముక్త కంఠంతో నినదించాయి.
అన్ని కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ వచ్చేలా….
ఆబిడ్స్ జిపిఓ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన స్వాతం త్య్ర సమరయోధుల చిత్ర పటాలు, రంగుల బ్యాన ర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం కోసం ట్రాఫిక్ పోలీసులు కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ వచ్చేలాఏర్పాట్లు చేశారు. జాతీయ గీతాలాపన ము గిసేవరకు వాహనాలను కూడళ్ల వద్ద నిలిపివేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా….
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం యావత్ తెలంగాణ జాతీయ గీతం “జనగణమన”తో మారుమ్రోగింది. ఉదయం 11.30 గం టలకు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపన కార్యక్రమం కన్నులపండుగగా ఘనంగా జరిగింది. ఉరూ వాడా, పల్లె పట్టణం జాతీయ గీతంతో మారుమ్రోగింది. పంట పొలాలు, పెళ్లి మండపాలు, ఎక్క డ చూసినా జాతీయ పతాకం రెపరెపలాడింది. రా ష్ట్రంలో అన్ని వర్గాలు కలిసికట్టుగా జాతీయ గీతాలాపనలో పాలుపంచుకున్నాయి. సరిగ్గా 11.30 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లపై వాహనాలు ఎ క్కడికక్కడే ఆగిపోయాయి. పంటపోలాల్లో రైతులు, కూలీలు, రోడ్లపై ప్రయాణీకులు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాలు, పంచాయితీ కార్యాలయాలు, అంగన్‌వాడి సెంటర్లు, మెట్రో రైళ్లు, ఇతర వాహనాలు నిముషం పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సామూహిక జాతీయ గితాలాపన ఆలపించాయి. దీంతో మారు మూల గ్రామం నుండి పట్టణాలు. నగరాల వరకు ‘జనగణమన’తో మారుమ్రోగింది. విద్యా సంస్థల్లో జాతీయ జెండాలతో విద్యార్థులు జాతీయ గీతాలాపన, మంత్రముగ్ధులను చేసింది. కుల, మత, వర్గ విభేదాలు లేకుం డా అన్ని వర్గాల ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడింది. దే శంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో రెండు వారాల పాటు స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజానీకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సిఎం కెసిఆర్ ఆబిడ్స్ కూడలిలో ప్రజా ప్రతినిధులు తమ తమ నియోజవ వర్గాల్లో సామూహిక గీతాలాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు తమ తమ కార్యాలయాల్లో సామూహిక గీతాలాపనతో మార్మోగించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నుండి వస్తూ 11.30 గంటల సమయంలో ఔటర్ రింగ్‌రోడ్డు పక్కన తన కాన్వాయ్‌ను ఆపి జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు.

Mass Singing of National Anthem in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News