Wednesday, January 22, 2025

తిరుమలలో తోపులాట

- Advertisement -
- Advertisement -

Masses of people flock to Thirumala

మన తెలంగాణ/హైదరాబాద్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకశ్వరస్వామి దర్శనం కోసం తిరుమలకు భారీగా జనం తరలి వచ్చారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం క్యూలైన్ల వద్ద తోపులాట జరిగింది. రెండు రోజుల విరామం తరువాత సర్వదర్శనం టోకెన్ల కేంద్రాలయిన గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. దాంతో అక్కడి జనం అదుపు తప్పడంతో తొక్కిసలాట సంభవించింది. గోవిందరాజస్వామి సత్రాల వద్ద జరిగిన తొక్కిసలాట వల్ల ముగ్గురికి గాయాలయ్యాయి, మరికొంత మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. గాయపడ్డ వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. సొమ్మసిల్లిన వారిని జనసందోహంలోంచి తీసుకొచ్చి సురక్షిత ప్రాంతంలో ప్రాధమిక వైద్యం అందించారు. ఈ పరిస్థితిపై స్పందిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీ బుధవారం నుంచి ఆదివారం వరకూ వరుసగా ఐదు రోజుల పాటు సర్వ దర్శనాలకూ, విఐపి బ్రేక్ దర్శనాలకు తాత్కాలిక విరామాన్నిచ్చింది.

భక్తుల తొక్కిసలాటను అదుపు చేయడానికి ఆ మూడు సర్వ దర్శనం క్యూలైన్ల వద్దా భద్రత కల్పిస్తూ పోలీసులు మోహరించారు. ఈ విషయంపై పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు, నాలుగు రోజులవుతున్నా సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వ్లదని పేర్కొన్నారు. అంతేకాకుండా భోజనం, మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నామని, నిర్వహణలో అవకతవకలపై ఆరోపణలు చేశారు. తమకు స్వామివారి సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వకపోయినా, కనీసం కొండపైకి కూడా అనుమతించ్లదని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను కొండపైకి అనుమతిస్తే, తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని ఆలయ అధికారులకు విన్నవించుకున్నారు. దాంతో భక్తులకు తగు భద్రత కల్పించడానికి, పరిస్థతి సద్దుమణిగేలా చేసేందుకు దేవస్థాన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులందరికీ టిక్కెట్టు లేకున్నా సరే శ్రీవారి దర్శనానికి అనుమతినిస్తామని స్పష్టం చేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News