- Advertisement -
వెల్గటూర్: మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో భారీగా యువకులు చేరికయ్యారు. శుక్రవారం కరీంనగర్ లోని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ క్యాంపు కార్యాయలం లో బిఆర్ ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఎండపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన యువకులు బిఆర్ ఎస్ పార్టీలో చేరగా వారికి మంత్రి పార్టీ కండువ కప్పి పార్టీలో చేర్చుకున్నారు.
కాంగ్రెసు పార్టీకి కంటుకోటలా ఉన్న కొండాపూర్ గ్రామం నుండి గతం లో మాజీ సర్పంచ్,వార్డు సభ్యులు చాల మంది బిఆర్‌ఎస్ పార్టీలో మంత్రి సమక్షంలో చేరారు. ప్రస్తుతం యువకులు చేరడం తో కొండాపూర్‌లో పార్టీ బలం మరింత పెరిగింది.
- Advertisement -