ఖమ్మం : ఖమ్మం జిల్లా కోర్టు పరిధిలో గల పలువురు న్యాయవాదులు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ లీగల్ సెల్ లో శుక్రవారం చేరారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో జరిగిన బి ఆర్ ఎస్ లీగల్ సెల్ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు. లీగల్ సెల్ నాయకులు పోట్ల శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జై భీం అద్యక్షుడు ఎక్కిరాల రాంబాబుతో పాటు వారి అధ్వర్యంలో పలువురు న్యాయవాదులు బిఆర్‌ఎస్ లీగల్ సెల్‌లో చేరారు. పార్టీలో చేరిన వారిలో ఎం.పూర్ణిమ, తన్నీరు లలిత, కుసుమరాజు కృష్ణ రావు, ప్రసాద్ యాదవ్, నవీద్ పాషా, సంపెట్ల లోకేష్, చల్లా కోటేశ్వర రావు, వడ్లమూడి వెంకటేశ్వర రావు, దరావత్ ప్రసాద్, చంద్ర శేఖర్, బసిపొంగు శ్రీను, రెగల్ల రాజేష్, భూక్యా నాగేశ్వర రావు, బండారు వెంకటరమణా రావు, కాంపల్లి నర్సింహారావు, చీరాల నారాయణ రావు, ఎర్ర నాగ రవి కుమార్, లింగాల శ్రీను, కొండా వెంకటేశ్వర్లు, కొప్పుల కృష్ణ, వేల్పుల సురేష్, బురా లక్ష్మణ తదితరులు ఉన్నారు .
వీరందరికి మంత్రి పువ్వాడ తెరాస పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడిందని, ఆ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే నని, స్పష్టం చేశారు. న్యాయవాదులు న్యాయం వైపు ఉండాలని, వాస్తవాలను సమాజానికి విప్పి చెప్పాలని కోరారు. ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తుందని, భవిష్యత్ లో న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిరిషల కృష్ణ రావు, పిపి లు పసుపులేటి శ్రీను, కొత్త వెంకటేశ్వర రావు, కొత్త వెంకటేశ్వర్లు, బిచ్చాల తిరుమల రావు, మేకల సుగుణాకర్ రావు, కంకణా పుథ్వి తదితరులు పాల్గొన్నారు.