Thursday, January 23, 2025

అభివృద్ధిని చూసే బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి ఆరూరి విశాల్ అన్నారు. హసన్‌పర్తి మండలంలోని సిద్ధాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి సుమారు 30 మంది ఉమ్మడి ఆరూరి విశాల్ సమక్షంలో గురువారం బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా విశాల్ గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చీకటి జయశంకర్, ముస్కు వంశీ, రాజేష్, సాయినాథ్, శ్రీమాన్, శ్రీధర్, విష్ణు, అరుణ్, రాజేష్, లక్ష్మణ్, మణికంఠ, కార్తీక్, మధు, శివ, గణేష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News