Monday, December 23, 2024

కశ్మీరులో పర్యాటకులపై విరుచుకుపడిన భారీ మంచు శకలం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని ఎత్తయిన మంచు పర్వత ప్రాంతమైన గుల్మార్గ్‌లో బుధవారం భారీ మంచు శకలం ఇద్దరు విదేశీ పర్యాటకులను బలిగొంది. దీని కింది చిక్కుకున్న మరో 21 మంది విదేశీ పర్యాటకులను పోలీసులు రక్షించారు. హపట్‌ఖుడ్ కంగ్‌డోరిలోని స్కీ స్లోప్స్(మంచుతో నిండిపోయి వాలుగా ఉండే పర్వత మార్గాలు) వద్ద ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో 21 మంది విదేశీయులతో కూడిన మూడు బృందాలు, ఇద్దరు స్థానిక గైడ్లు మంచు రియలు విరిగిపడిన సమయంలో అక్కడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోల్యాండ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకలు ఈ సంఘటనలో మరణించినట్లు వారు చెప్పారు.

మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో భారీ మంచు శకలం దొర్లుకుంటూ అక్కడ పడినట్లు వారు తెలిపారు. ఇద్దరు పోలిష్ జాతీయుల మృతదేహాలను వెలికితీసి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. స్కీ స్లోప్స్‌కు ప్రసిద్ధి చెందిన అఫర్వత్ ప్రాంతంలోని మంచు పర్వతాలలో చిక్కుకున్న 19 మంది పర్యాటకులను బారాముల్లా జిల్లా పోలీసులు రక్షించారు. గుల్మార్గ్ సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు వారిని తరలించారు. తమ కళ్ల ముందే మృత్యువు కనిపించిందని, 20 అడుగుల గోడలాంటి మంచు శకలం స్కైయర్ల పైన విరుచుకుపడిందని, దాని కింద వారంతా చిక్కుకుపోయారని కర్నాటకకు చెందిన దీపక్ చించోరె అనే పర్యాటకుడు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News