- Advertisement -
కాబూల్: తూర్పు అఫ్ఘానిస్థాన్‌లో సోమవారం జరిగిన భారీ పేలుడులో 9మంది చిన్నారులు చనిపోగా, నలుగురు గాయపడ్డారు. ఆహార పదార్థాలను అమ్మే బండి అక్కడి ఓ పాత మోర్టార్‌షెల్‌ను ఢీకొనడంతో ఈ పేలుడు జరిగిందని తాలిబన్ల గవర్నర్ తెలిపారు. పాక్ సరిహద్దులోని నాగర్‌హర్ రాష్ట్రం లాలోపార్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. తాలిబన్లను వ్యతిరేకించే ఇస్లామిక్‌స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులకు ఈ రాష్ట్రం కేంద్రస్థానంగా ఉన్నది. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత మైనార్టీలైన షియా ముస్లింలు లక్షంగా పలు హింసాత్మక దాడులకు ఐఎస్ ఉగ్రవాదులు పాల్పడ్డారు. దశాబ్దాలుగా అంతర్యుద్ధాలతో అట్టుడుకుతున్న అఫ్ఘానిస్థాన్‌లోని పలు చోట్ల భూమిలో పాతిపెట్టిన మందుపాత్రలు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. అప్పుడప్పుడూ అమాయకులు, చిన్నారులు వీటి బారినపడి బలవుతున్నారు.
- Advertisement -