Wednesday, January 22, 2025

తాజ్ మహల్ నిర్వహణలో భారీ అవినీతి

- Advertisement -
- Advertisement -
Massive corruption in management of Taj Mahal
యుపిలో సిబిఐ కేసు

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని తాజ్ మహల్, లక్నోలోని రిసిడెన్సీతోసహా అనేక చారిత్రాత్మక ప్రదేశాలలోని ఉద్యానవనాల పరిరక్షణలో భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్లు సిబిఐ కేసు నమోదు చేసింది. ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎఎస్‌ఐ) అధికారులు ఈ అవినీతికి పాల్పడినట్లు సిబిఐ ఆరోపించింది. ఎఎస్‌ఐ మైసూరు సర్కిల్‌లో పనిచేసే అన్‌స్కిల్డ్ వర్కర్లు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్నోలోని చారిత్రాత్మక ప్రదేశాలలోని ఉద్యానవనాలలో పనిచేస్తున్నట్లు తప్పుడు బిల్లులు సృష్టించి ప్రభుత్వ సొమ్మును ఆ కాంట్రాక్టర్ దోచుకున్నట్లు సిబిఐ ఆరోపించింది. ఎఎస్‌ఐ కోట, ఢిల్లీ సర్కిళ్లలో పనిచేసే కార్మికులను కూడా లక్నోలో పనిచేసినట్లు కాంట్రాక్టర్ నకిలీ బిల్లులు సృష్టించినట్లు సిబిఐ పేర్కొంది.

కుషీనగర్, ఆగ్రా, కాన్పూర్ తదితర యుపిలోని అనేక చారిత్రాత్మక ప్రదేశాలలోని గార్డెన్స్ నిర్వహణ కోసం ఇదే విధంగా తప్పుడు బిల్లులను కుల్దీప్ సింగ్ అనే కాంట్రాక్టర్ సృష్టించి, భారీ స్థాయిలో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని సిబిఐ ఆరోపించింది. ఆగ్రాలోని సికందర, రాంబాగ్, ఫతేపూర్ సిక్రిలో కూడా ఇదేవిధంగా అవినీతి జరిగిందని సిబిఐ తన ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. లక్నోలోని రిసిడెన్సీని బ్రిటిష్ రెసిడెన్సీ అని కూడా పిలుస్తారు. ఈ సముదాయంలో అనేక భవనాలు ఉన్నాయి. నవాబుల కాలంలో బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ ఉపయోగంలో ఈ భవనాలు ఉండేవి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News