- Advertisement -
అర్జెంటీనా: అర్జెంటీనాలో భారీ భూకంపం సంభవించింది. శాంటియాగో డెల్ ఎస్టెరో ప్రావిన్స్‌లోని మోంటే క్యూమాడోకు 104 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామున 3:39 గంటలకు భూకంపం వచ్చిందని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 600 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. కార్డోబాకు 517 కిలోమీట్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని పేర్కొన్నది.
- Advertisement -