Wednesday, January 22, 2025

బస్తర్‌లో భారీ ఎన్‌కౌంటర్…. 30 మంది నక్సల్స్ హతం

- Advertisement -
- Advertisement -

భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం

దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 30కి చేరిందని పోలీసులు వెల్లడించారు. నారాయణ్‌పూర్-దంతెవాడ అంతర్ జిల్లా సరిహద్దులోని అభూజ్‌మాడ్ అడవులలో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కాల్పుల పోరు జరిగినట్లు పోలీసులు తెలిపారు. నక్సల్స్ ఏరివేత కోసం చేపట్టిన గాలింపు చర్యలలో భాగంగా భద్రతా దళాల సంయుక్త బృందం ఆ ప్రాంతానికి వెళ్లినట్లు వారు చెప్పారు. బృందంలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు(డిఆర్‌జి), స్పెషనల్ టాస్క్ ఫోర్సు(ఎస్‌టిఎఫ్)కు చెఇందిన సిబ్బంది పాల్గొన్నారు.

కాల్పుల పోరు అనంతరం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని గాలించగా భారీ మొత్తంలో ఆయుధాలతోసహా 30 మంది నక్సల్స్ మృతదేహాలు లభించాయని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఒక ఎకె 47 రైఫిల్, ఒక ఎస్‌ఎల్‌ఆర్(సెల్ఫ్ లోడింగ్ రైఫిల్)తోసహా పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించినట్లు వారు చెప్పారు. ఆ ప్రాంతంలో భద్రతా దళాల గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌ను కలుపుకుంటే ఏ ఏడాదిలో దంతేవాడ, నారాయణ్‌పూర్‌తోసహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాల ఎదురుకాల్పులలో మొత్తం 171 మంది మావోయిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News