- Advertisement -
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గురువారం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. నారాయణపూర్-బీజాపూర్ సరిహద్దులో పోలీసులు-మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి గురువారం కూంబింగ్ చేపట్టడంతో మావోలు తరసపడ్డారు. మావోలను లొంగిపోవాల్సిందిగా భద్రతా బలగాలు సూచించాయి. కానీ భద్రతా బలగాలపై మావోలు కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఉదయం 11 గంటల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు మావోల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు వెల్లడించాయి. ఈ ఎన్‌కౌంటర్ వంద మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారం.
- Advertisement -