Wednesday, January 22, 2025

దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్: 9 మంది మావోలు మృతి

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడలో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు- మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. భద్రతా బలగాలు అలజడి వినగానే మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఎదురుకాల్పుల్లో తొమ్మది మంది మావోలు మృతి చెందారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి తప్పించుకున్న మావోల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News