Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

పెద్ద కొడప్‌గల్: పెద్ద కొడప్‌గల్ మండలంలోని బాబుల్ గాం గ్రామానికి చెందిన ముదిరాజ్, ముస్లిం సోదరులు, యువకులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార బిఆర్‌ఎస్ పార్టీలో గ్రామ అధ్యక్షుడు వీరారెడ్డి ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు.

సిఎం కెసిఆర్ సహాయ, సహకారాలతో జుక్కల్ నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధ్దికి నిధులను మంజూరు చేయిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. బాబుల్ గాం గ్రామానికి చెందిన నాయకులు పార్టీలో చేరడం చాలా సంతోషకరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ ఎస్‌కె గౌస్, ఉప సర్పంచ్ నర్సుగొండ, మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి, సురేష్ రెడ్డి, పార్టీ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News