Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి తుంగతుర్తి నియోజక వర్గంలోని అభివృద్ధిని చూసి ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు, బిఆర్‌ఎస్ పార్టీలోకి భారీగా చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం అర్వపల్లి మండల పరిధిలోని జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నా యకులు తిర్మలగిరిలోని ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నివాసంలో వార్డు మెంబర్ కపటం రాజుతో పాటు కపటం రవి,నర్సింగశోభన్, సుమన్, సైదులు, ఎండిగౌస్ తో కలిసి నూట యాభై మంది ఎమ్మెల్యే సమక్షంలో చేరారు.

వారికి సాదరంగా పార్టీ కండుకప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధ్ది పథకాలు దేశానికే ఆధర్శంగా నిలిచి ఇతర రాష్ట్ర నాయకుల కూడ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అభివృద్ధిపథకాలు ఇతర రాష్ట్రాలు కూడ చేపట్టాలని అనుకుంటున్నారని వారన్నారు. తుంగతు ర్తి నియోజక వర్గంలో వేల కోట్లు వెచ్చించి నియోజక వర్గాన్ని సశ్యశ్యామల ంగా అభివృద్ధి పథకంలో నడిపించినట్లు దానిని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలోకి చేతరుతున్నారని వారన్నారు.

దీంతో పాటు రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా, ప్రతి ఒక్క రైతుకు లక్ష రూపాయల రుణ మాఫీ ఎస్‌ఆర్‌ఎస్వీ కాలువల ద్వారా పంటలు ప ండి ంచుకోవడానికి నీరు అందజేత, దీంతో రైతు తుంగతుర్తి నియోజక వర్గంలో పచ్చదనంతో పంటలు పండించుకుంటున్నారని వారన్నారు. సంక్షేమ పథకాలలో దళిత బంధు, బిసి బంధు, మైనార్టీ బందుతో పాటు వికలాంగులకు నాలుగువేల నూట పదహర్లు, వితంతువులకు ఆసరా పించన్‌లు, ఎక్కువగా అందించేది తుంగతుర్తి నియోజక వర్గంలోనే అని దాని ద్వారా నాయకులు పార్టీలోకి చేరుతున్నారని వారన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకు లు గుండగాని సోమేష్‌గౌడ్, జిల్లా నాయకులు మన్నెలక్ష్మినర్సయ్య యా దవ్, మొరిశెట్టి ఉపేందర్, గ్రామసర్పంచ్ కుంభం ఉషారాణి నాగరాజు,పెద్ది శ్రీనివాస్, సోమిరెడ్డి, నాగరాజు, కోటమర్తి మల్లయ్య, వెంకన్న, గ్రామశాఖ అధ్యక్షులు పొన్న హరిప్రసాద్, చేరిన వారు లక్ష్మయ్య, నగేష్, సంతోష్, శ ంకర్, యాకూబ్, సోములు, చెనమల్లు, శ్రీరాములు, తుంగఅలివేలు, వె ంకన్న, పూలమ్మతో పాటు మహిళలు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News