- Advertisement -
మాస్కో: రష్యాలోని గ్యాస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించారు. పేలుడు ఘటనలో మరో 100 మందికిపైగా గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 13మంది చిన్నారులు ఉన్నారు. డాగేస్తాన్ రాజధాని మఖచ్కలలో ఈ ప్రమాదం జరిగింది. తొలుత కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో చెలరేగిన మంటలు క్రమంగా గ్యాస్ స్టేషన్‌కు విస్తరించడంతో ఒక్కసారిగా భారీ పేలుడు, మంటలు సంభవించాయి. మంటల్లో చిక్కుకుని వాహనాలు కాలి బూడిదయ్యాయి. భారీగా ఆస్తినష్టం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 256 ఫైరింజన్లతో మంటలార్పివేశారు.
- Advertisement -