Monday, December 23, 2024

ట్యాంక్‌బండ్ డంప్‌యార్డులో భారీ పేలుడు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: లోయర్ ట్యాంక్‌బండ్‌లోని స్నోవరల్డ్ పక్కనున్న చెత్త డంపింగ్ యార్డు (టిబిటి)లో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో చెత్త కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లో యర్‌ట్యాంక్‌బండ్ స్నోవరల్డ్ పక్కనున్న చెత్తడంపింగ్ యా ర్డులో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆటోలలో సేకరించిన చెత్తను ఇక్కడ డంపింగ్ చేస్తారు.కాగా గురువారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో మడ్‌పోర్ట్‌లో నివాసం ఉం డే చంద్రన్న(42), అతని కొడుకు సురేష్ (14) లు డంపింగ్ యార్డులోని చెత్తకుప్పల్లో చిత్తు కాగితాలను ఏరుకుంటుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే ఉన్న కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి వారు తేరుకుని చూసే లోపే చంద్రన్న ఎడమచేతి మణికట్టు పూర్తిగా తెగిపోగా, కొడుకు సురేష్ తలతో పాటు శరీరమంతా తీవ్రగాయాలై పడిపోయాడు.

వెంటనే అక్కడ ఉన్న వారు 108కు సమాచారం అందించగా తండ్రీ కొడుకులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పేలుడు సమాచారం అందుకున్న చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాంబుస్వ్కాడ్, డాగ్‌స్వాడ్, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, క్లూస్‌టీం సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను విశ్లేశించి ఆధారాలను సేకరించారు. పేలుడు ఏవిధంగా జరిగిందిని తనిఖీ చేశారు. అనంతరం చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి మాట్లాడుతూ చెత్త కుప్పలోని తిన్నర్, పెయింటర్ డబ్బాల కారణంగా పేలుడు సంభవించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. పెయింట్, తిన్నర్ డబ్బాల వల్ల పేలుడు జరిగిందా, మరేదైనా పేలుడు పదార్థాల కారణంగా పేలుడు సంభవించిదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పేలుడు జరిగిన డంపింగ్ యార్డు ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి సందర్శించి పేలుడుకు సంబంధించిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నామని గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ మోహన్‌రావు తెలిపారు. తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్న సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News