Thursday, January 23, 2025

అచ్యుతాపురం సెజ్‎లో భారీ పేలుడు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‎లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పేలుడు ధాటికి మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అచ్యుతాపురం సెజ్ లోని లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో ఈ పేలుడు జరిగింది. రియాక్టర్ పేలడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో హూటాముటిన ఘటానాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News