విరుద్ధునగర్(తమిళనాడు): నగరంలోని ఒక స్టోన్ క్వారీలో బుధవారం భారీ పేలుడు సంభవించి ముఉ్గరు కార్మికులు మరణించారు. పేలుడు దాటికి వారి శరీరాలు తునాతునకలై గాలిలోకి ఎగిరిపడగా కొన్ని శిథిలాల కింద సమాధి అయ్యాయని పోలీసులు తెలిపారు. పేలుడు కారణంగా దట్టమైన పొగ, ఇసుక గాలిలోకి ఎగసిపడినట్లు సమీప ప్రాంతాల ప్రజలు తెలిపారు. క్వారీని మూసివేయాలంటూ వారు రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు.పేలుడు దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాలో రికార్డు అయ్యాయి.
నిల్వ చేసేందుకు వాహనం నుంచి కార్మికులు పేలుడు పదార్థాలు దించుతున్న సమయంలో పేలుడు సంభవించిందని విరుద్ధునగర్ జిల్లా ఎస్‌పి కె ఫిరోజ్ ఖాన్ అబ్దుల్లా తెలిపారు. పేలుడు తీవ్రతకు ముగ్గురు కార్మికుల తునాతునకలై గాలిలోకి ఎగిరిపడ్డాయని ఆయన తెలిపారు. పేలుడు పదార్థాలను తరలించడంలో జరిగిన అజాగ్రత్తే ఈ పేలుడుకు కారణం కావచ్చని ఆయన చెప్పారు. క్వారీకి పేలుడు సదార్థాలను ఉపయోగించడానికి లైసెన్సు ఉందని, అక్కడ భద్రతపరచడానికి కూడా లైసెన్సు ఉందని ఆయన చెప్పారు. క్వారీకి సంబంధించిన ఒక వ్యక్తిని ప్రశ్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.