Monday, December 23, 2024

ఫార్మా కంపెనీలో భారీ పేలుళ్లు: ఇద్దరికి తీవ్ర గాయాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ బీబీనగర్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని కొండమడుగు గ్రామంలో గల సిస్ట్రాన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శనివారం రాత్రి ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. దీంతో ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమ వాచ్ మెన్ గా పనిచేస్తున్న నాగేష్ తో పాటు కార్మికుడు బానోతు మహేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News