Saturday, April 5, 2025

పాట్నా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

బీహార్ రాజధాని పాట్నా రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్న ఈ హోటల్‌లో మంటలు చెలరేగగా భవనంలో చిక్కుకుపోయిన 20 మందికి పైపౌరులను రక్షించినట్లు జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలిసు రాజీ మిశ్రా తెలిపారు. మంటల్లో ఇద్దరు సజీవ దహనం కాగా తీవ్రంగా గాయపడిన నలుగురు ఆసుపత్రిలో మరణించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందని డిఐజి మృత్యుంజయ్ కుమార్ చౌదరి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News