Thursday, January 23, 2025

సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Massive fire at Secunderabad Club

రూ.20కోట్ల ఆస్తి నష్టం చారిత్రక క్లబ్ ప్రమాద కారణాలపై విచారణ అస్తినష్టం తప్ప ప్రాణనష్టం జరగలేదు : క్లబ్ అధ్యక్షుడు రఘురాంరెడ్డి

మన తెలంగాణ/సిటీబ్యూరో: సికింద్రాబాద్ క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి పెద్ద ఎత్తున మంటలు అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. జరిగింది. ఆదివారం తెల్లవారుజూమున 3 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో క్లబ్ పరిసరాలంతా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధ్దమైంది. సమాచారం అం దుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థ్దలికి చేరుకుని మంటుల అదుపు చేశారు. మంటలు అదుపు చేసేందుకు 10 అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపు చేసేందుకు సుమారు 4 గంటల సమయం పట్టింది. క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు క్లబ్ నిర్వాహకులు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని, ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 1878లో బ్రిటిష్ హయాంలో మిలటరీ అధికారుల కోసం ఈక్లబ్ నిర్మించారు. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సికింద్రాబాద్ క్లబ్‌లో ఐదంతస్తుల హోటల్ తరహాలో నిర్మించారు.

సంక్రాంతి పండగ కావడంతో శనివారం క్లబ్ మూసివేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈక్లబ్‌లో దాదాపు 300మంది సిబ్బంది పనిచేస్తుండగా, 4వేల మందికిపైగా సభ్యత్వం ఉన్నట్లు కమిటీ పేర్కొంది. అగ్నిప్రమాదం షార్ట్ సర్కూట్‌తో జరిగినట్లు, క్లబ్ ముందు భాగం మొత్తం కలప, చెక్కతో నియమించబడటంతో ప్రమాదం ఈ స్థాయిలో జరిగిందని రఘరాం రెడ్డి పేర్కొన్నారు. ఎంత ఆస్తి నష్టం జరిగిందే విషయం ఇప్పడే అంచనా వేయలేమని, సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్చర్, ఎలక్ట్రికల్ విభాగం అధికారులు పరిశీలన చేసిన తరువాత నష్టం వివరాలు వెల్లడించవచ్చన్నారు. ఘటనలో ఆస్తినష్టం తప్ప, ప్రాణనష్టం జరగలేదని, ప్రస్తుతం 20 ఎకరాల్లో క్లబ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు క్లబ్ కావడంతో ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వడం లేదని, రెండు రోజులు అన్ని విషయాలకు స్పష్టత వస్తుందని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News