Wednesday, January 22, 2025

ముంబైలోని అంధేరీలోని షాపింగ్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

Mumbai Fire

ముంబై: ముంబైలోని అంధేరిలోని ఓ షాపింగ్ ఏరియాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. సంఘటనా స్థలం వద్ద భవనం నుండి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు అక్కడికి చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. సాయంత్రం 4.30 గంటలకు అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వెనుక డిఎన్ నగర్ నుండి మంటలు చెలరేగడంతో ఎనిమిది అగ్నిమాపక శకటాలు,  ఐదు జంబో ట్యాంకర్లను సంఘటనా స్థలానికి తరలించారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అలంకారిక మండపం వద్ద మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇంకా దృవీకరించుకోవలసి ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే పనిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News