Monday, December 23, 2024

గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Massive fire break out in Gurugram's Manesar

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ నగర స‌మీపంలోని గురుగ్రామ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమ‌వారం అర్ధ‌రాత్రి మ‌నేస‌ర్‌లోని సెక్టార్-6 సమీపంలో ఉన్న గార్బేజ్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తూ భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని 36 ఫైరింజన్లతో సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు.

Massive fire break out in Gurugram’s Manesar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News