- Advertisement -
ఫూణెలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పూణె నగరంలోని భవాని పేట్ ప్రాంతంలో ఉన్న ఓ ఫర్నిచర్ గోదాంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకుని హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 18 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.
- Advertisement -