- Advertisement -
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు పిల్లలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆదివారం నగరంలోని రోహిణి ప్రాంతంలో ఉన్న ఒక మురికివాడలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం రసంభవించింది. ఈ ఘటనలో 800కు పైగా గుడిసెలు దగ్ధం కావడంతో ఇద్దరు పిల్లలు మరణించగా, ఐదుగురు గాయపడ్డారని ఢిల్లీ అగ్నిమాపక అధికారి ఒకరు తెలిపారు.
అగ్ని ప్రమాదంతో దట్టంగా పొగ వ్యాపించింది. దాదాపు ఐదు ఎకరాల్లో ఉన్న గుడిసెలు దగ్ధమైన దట్టమైన పొగ కమ్మేసింది. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అనంతరం గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -