Friday, November 15, 2024

18మంది అగ్నికి ఆహుతి

- Advertisement -
- Advertisement -

Massive Fire Breaks Out at Pune Chemical Plant

 

పుణె శివార్లలోని శానిటైజర్ల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం
మృతుల్లో అత్యధికులు మహిళా కూలీలు, మరో 17 మంది కార్మికులు గల్లంతు?

పుణె: కరోనా, లాక్‌డౌన్‌ల దశలో మహారాష్ట్రలోని పుణేలోని ఎస్‌విఎస్ అక్వా టెక్నాలజీస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు జరిగిన ఈ అగ్నిప్రమాదంలో కనీ సం 18 మంది కార్మికులు సజీవదహనం చెందారు. వీరిలో అత్యధికు లు మహిళలు ఉన్నారు. క్లోరిన్ ద్వారా శానిటైజర్లు తయారు చేసే ఈ ఫ్యాక్టరీలో ఈ ఘటన తరువాత ఐదుగురి జాడ తెలియడం లేదు. దీని కి సంబంధించిన వివరాలను అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. పారిశ్రామికవాడలో ఉన్న ఎస్‌విఎస్ సంస్థలో ప్రమాదకర క్లోరిన్ డయాక్సైడ్ వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ ఫ్యాక్టరీ పుణే శివార్లలోని ముల్షీతాలూకాలో ఉన్న పిరణ్‌గట్ ఇండిస్ట్రియల్ ఏరియాలో ఉంది.

అసలే క్లోరిన్ వాయువు ఉత్పత్తి కేంద్రం, ప్లాస్టిక్ పార్శిల్స్ విభాగం కావడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు వెల్లడైంది. కంపెనీ అధికారులు చెపుతున్న దాని ప్రకారం ప్రమాదం తరువాత 17 మంది వర్కర్లు కన్పించకుండా పొయ్యారు. ఇప్పటికైతే పూర్తిగా కాలిపోయి ఉన్న 12 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. మంటలు చల్లార్చిన తరువాత ఇతర భౌతిక కాయాల కోసం వెతుకుతున్నారు. ప్రమాద దశలో ఫ్యాక్టరీలో 37 మంది కార్మికులు ఉన్నారు. ఆరు ఏడు అగ్నిమాపక శకటాలు హుటాహుటిన ఫ్యాక్టరీకి చేరుకున్నాయి. తొందరగానే మంటలు ఆర్పివేశాయి.

మంటలు చెలరేగడానికి కారణాలను ఆరా తీస్తున్నామని చీఫ్ ఫైర్ ఆఫీసర్ దేవేంద్ర పాట్‌ప్పోడే తెలిపారు. అయితే ఆవరణలోని ప్లాస్టిక్ సామాగ్రి ప్యాకింగ్ దశలో మంటలు వ్యాపించి ఉంటాయని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ప్యాకింగ్ సెక్షన్‌లో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారు. ప్యాకింగ్ సెక్షన్‌లో ఓ చోట నిప్పురవ్వలు లేచాయని తరువాత ప్లాస్టిక్ అంటుకుని ఉంటుందని ఇది త్వరితగతిన వ్యాపించి ఉంటుందని తెలిపారు. నీటి శుద్థికి అవసరం అయిన క్లోరిన్‌ను ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తున్నారని పుణే ఎస్‌పి డాక్టర్ అభినవ్ దేశ్‌ముఖ్ తెలిపారు. సూక్ష్మజీవులను నశింపచేసే లక్షణాలు, మంచినీటిని శుభ్రపరిచే గుణం ఎక్కువగా ఇక్కడి కెమికల్ పదార్థం క్లోరిన్ డయాక్సైడ్‌కు ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News