Saturday, September 28, 2024

హోసూర్ లో టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హోసూర్(తమిళనాడు-కర్నాటక): తమిళనాడు సరిహద్దు హోసూర్ లో ఉన్న టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్ లో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ తయారీ సెక్షన్ లో మొదట మంటలు చెలరేగాయి. తర్వాత కార్మికులందరినీ అక్కడి నుంచి ఖాళీచేయించేశారు. ఈ అగ్ని ప్ర్రమాదంలో గణనీయమైన ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. ప్రస్తుతం అగ్నిమాపక దళాలు మంటలు ఆర్పే పనిలో ఉన్నారు.

స్థానికుల ప్రకారం నాగమంగళం సమీపంలోని ఉద్దనపల్లిలోని కంపెనీ మొబైల్ ఫోన్ యాక్ససరీస్ పెయింటింగ్ యూనిట్లో మంటలు మొదలయ్యాయి. దట్టమైన అతి త్వరగా వ్యాపించడంతో కార్మికులు, స్థానికులు హతాశులయ్యారు. కార్మికలను ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించి అగ్నిమాపక దళాలు మంటలు ఆర్పే పనిని చేపట్టాయి. ప్రస్తుతానికి ఎవరికీ గాయాలయిన సమాచారం లేదు. కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది.

మంటలు చెలరేగినప్పుడు డ్యూటీలో దాదాపు 1500 మంది కార్మికులు పనిలో ఉన్నారు. కాగా ముగ్గురు కార్మికులకు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News