- Advertisement -
రంగారెడ్డి జిల్లా ఆరాంఘర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎం పహాడీ, ఆరాంఘర్‌లో రెండు ప్రాంతాల్లో ఒకేసారి అగ్నిప్రమాదం సంభవించింది. స్క్రాప్ గోదాంలో ఒకసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనతో దూరంగా పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
- Advertisement -