Monday, December 23, 2024

సూరత్ లో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

సూరత్: కార్ల షోరూం లో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిన సంఘటన గురువారం రాత్రి సూరత్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే .. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరత్ పట్టణంలోని ఉద్నా వద్ద  కార్ల షోరూంలో ఒక్కసారిగా మంటలు ఎగిపడ్డాయి. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగ కమ్ముకుంది.

దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News