Sunday, February 23, 2025

పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

అర్వపల్లి : సూర్యాపేట జిల్లా, తిర్మలగిరి మున్సిపల్ కేంద్రంలోని అనంతారం రోడ్డులో గల సంతోషిమాత పత్తిమిల్లులో ఆదివారం షార్ట్‌సర్కూట్‌తో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పత్తితో పాటు వివిధ యంత్రాలు, పైపులు, మిషన్‌లు దగ్ధమయ్యాయి. దీనివల్ల దాదాపు పది లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే గుర్తించిన కార్మికులు మిల్లు యజమానికి తెలిపారు. దీతంఓ భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పడానికి మూడు ఫైర్‌ఇంజన్‌లను తెప్పించి నాలుగు గంటలు శ్రమపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలతో పాటు భారీ పొగ రావడంతో ఊపిరాడకపోయినా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్‌సిబ్బంది ఆర్పారు. పోలీసులు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News