Thursday, December 19, 2024

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున నగరంలోని గాంధీనగర్ మార్కెట్లో ఉన్న ఓ ప్లేవుడ్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

ఈ మేరకు హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకున్న సిబ్బంది 21 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News