Sunday, December 22, 2024

ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం షాహిబాగ్ ప్రాంతంలోని రాజస్థాన్ ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పది అంతస్తులున్న ఈ ఆస్పత్రి బేస్‌మెంట్‌లో మంటలు ఎగసి పడి దట్టంగా పొగ కమ్ముకు రావడంతో 125 మంది రోగులను తక్షణం అక్కడి నుంచి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణనష్టం జరగలేదు. ఆస్పత్రి బేస్‌మెంట్‌లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని , ఈ నేపథ్యంలో అక్కడ నిల్వ ఉంచిన అనేక వస్తువుల నుంచి పొగలు, మంటలు వచ్చినట్టు పోలీస్‌లు చెప్పారు.

రెండో బేస్‌మెంట్ నుంచి మొదట మంటలు రావడంతో తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో ఆస్పత్రి నుంచి తమకు సమాచారం అందిందని, వెంటనే దాదాపు 24 అగ్నిమాపక శకటాలు అక్కడకు వెళ్లి మంటలను ఆర్పడానికి ఎనిమిది గంటలు పట్టిందని డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ జయేష్ ఖాడియా తెలియజేశారు. పొగ కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది గదుల్లోకి వెళ్లడం కష్టమైందని షాహిబాగ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఎండి చంపావత్ చెప్పారు. ఈ 125 మంది రోగులను ముందు జాగ్రత్త చర్యగా వివిధ ఆస్పత్రులకు తరలించారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News