Monday, December 23, 2024

సికింద్రాబాద్‌‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ నల్లగుట్టలోని ఓ స్పోర్ట్స్ షాపులో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని డెక్కన్‌ నైట్‌వేర్‌ స్పోర్ట్స్‌ షాప్‌లో ఉదయం 7 నుంచి 7:30 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం, మంటలు చెలరేగడంతో ఆరుగురు వ్యక్తులు భవనం పై అంతస్తులో చిక్కుకున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఫైర్‌ అధికారులు క్రేన్‌ సహాయంతో పై అంతస్తులో చిక్కుకున్న వారిని రక్షించినట్లు సమాచారం. ఎటువంటి ప్రాణనష్టం జరగనప్పటికీ, పొగలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పోలీసుల భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News