Sunday, January 19, 2025

కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

జగిత్యాల జిల్లా కోరుట్లలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి సుఫియాన్ సా మిల్లులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మిల్లు మొత్తం దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఫైరింజిన్లతో మంటలను అదుపు చేశారు.

ఈ అగ్నిప్రమాదంలో దాదాపు కోటి రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షాట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగనట్లు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News