Wednesday, March 12, 2025

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అంధేరి ప్రాంతంలోని ఏడు అంతస్తుల నివాస భవనంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని తెలిపారు. అంధేరి (పశ్చిమ)లోని చించన్ భవనంలోని ఆరో అంతస్తులోని ఫ్లాట్‌లో ఉదయం 8.42 గంటలకు మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. హుటాహుటిన ఘటనాస్థలానికి నాలుగు అగ్నిమాపక వాహనాలను తరలించి సహాయక చర్యలు చేపట్టామని, కొద్ది నిమిషాల్లోనే మంటలను ఆర్పివేశామని అగ్నిమాపక అధికారి తెలిపారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News