Tuesday, March 4, 2025

థానే హైపర్ సిటీ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని థానే జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం థానేలో ఘోడ్‌బందర్ రోడ్ ప్రాంతంలోని హైపర్ సిటీ మాల్‌లోని ప్యూమా బ్రాండ్ అవుట్‌లెట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఉదయం మాల్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పికప్ ఫైర్ ట్రక్, థానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ  ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News