Sunday, December 22, 2024

టింబర్ డిపో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

తుర్కయంజాల్ మున్సిపాలిటీ తొర్రూర్‌లో ఉన్న గీత టింబర్ డిపో గోదాంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. టింబర్ డిపోలో ఉన్న ప్తైవుడ్ డోర్‌లు పూర్తిగా దగ్ధమైయ్యాయి. గోదాంలో మంటలు ఎగసి పడుతుండడంతో హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించిన, సొగ కుమ్ముకు పోవడంతో మళ్లీ మంటలు చేలరేగాయి. సాయంత్రం వరకు కూడా అదుపులోకి రాలేదు. గోదాంలో భారీ ఎత్తున ప్లైవుడ్ ఉండడంతో మంటలు చేలరేగుతున్నాయని ఫైర్‌స్టేషన్ అధికారి యాదగిరి తెలిపారు.

గోదాంలో అగ్నిప్రమాదం షార్ట్‌సర్కూట్ కారణమవ్వచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదాంలో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలిపోవడంతో సుమారు కోటిన్నరకు పైగా నష్టం వాటిల్లిందని నిర్వహకులు రాకేష్ పటేల్ తెలిపారు. డిపో ప్రక్కనే బాటిల్స్ శు భ్రపరిచే గోదాం ఉండడంతో అక్కడ వాడే రసాయనాలు కారణం కూడ మం టలు చేలరేగవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో వారికి రసాయనాలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని టింబర్ డిపో నిర్వాహకులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News