Friday, January 10, 2025

యుపిలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్థరాత్రి ఝాన్సీ జిల్లాలోని సిప్రి బజార్ ప్రాంతంలో ఉన్న ఓ షోరూంలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News