ఢిల్లీ అగ్ని పమ్రాదంలో
27 మంది దుర్మరణం
మెట్రోస్టేషన్ వద్ద ఘటన, 40మందికి గాయాలు
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీ సం 27 మంది సజీవదహనం అయ్యారు. 40 మంది వరకూ గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం మంద్కా మెట్రోస్టేషన్ వద్ద ఉన్న ఓ వాణి జ్య భవనంలో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. చాలా సేపటివరకూ అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలు ఆర్పుతున్నాయని ఎక్కువగా ప్రాణనష్టం జరగలేదని ప్రకటనలు వెలువరిస్తూ వచ్చారు. అయితే రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ భవనం మంటలలో కనీసం 16 మంది కాలిపోయి పడి ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మంటలు చెలరేగుతున్న భవనం నుంచి దాదాపు 70 మందిని అతి కష్టం మీద సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అగ్నిమాపక సిబ్బ ంది, స్థానికులు సకాలంలో స్పందించడం వల్లనే ఎక్కువ మందిని రక్షించగల్గినట్లు తెలిసింది. అయితే ఈ మూడంతస్తుల భవంతిలో ఎక్కువగా వివిధ కంపెనీల కార్యాలయాలు లీజు లేదా అద్దెల ప్రాతిపదికన పనిచేస్తున్నాయని స్థానిక పోలీసు అధికారి సమీర్ శర్మ తెలిపారు.
దాదాపు 24 అగ్నిమాపక శకటాలతో వచ్చి మంటలను అదుపు చేసే పనిలో సిబ్బ ంది నిమగ్నం అయ్యింది. మెట్రోస్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 544 వద్ద ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్లు తమకు 4.40 గంటల ప్రాంతం లో సమాచారం అందిందని అగ్నిమాపక దళ అధికారులు తెలిపారు. మంటలలో మూడు అంతస్తులు పూర్తిగా తగలుబడ్డాయి. మూడో అంతస్తులో ఇంకా గాలింపు జరగాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ఈ ప్రమాదంలో మృతులలో ఒక మహిళ ఉన్నట్లు ఇప్పటికైతే గుర్తించారు. మొదటి ఫ్లోర్‌లోని సిసిటీవీ కెమెరాలు రౌటర్ల ఉత్పత్తి కంపెనీ నుంచి మంటలు చెలరేగి ఇతర అంతస్తులకు వ్యాపించాయని ప్రాధమిక దర్యాప్తు క్రమంలో వెల్లడైంది. మరోవైపు భవన యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అగ్ని ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.