Monday, December 23, 2024

గండిపేటలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేటలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ భవనంలో మంటలు చెలరేగడంతో సిబ్బందిలో భయాందోళనలు నెలకొన్నాయి. భవనం చుట్టూ పోగ కమ్మేసింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో విచారిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News