Thursday, December 19, 2024

నిజామాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ లో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దేవి రోడ్డులోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 7 ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురికి స్పల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News