Saturday, December 21, 2024

పురానాపూల్ లో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పురానాపూల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసకుంది. కూలర్ల గోడౌన్ లో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి ఆరు ఫైర్‌ ఇంజిన్లను తరలించి, మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ పొగ ఆ ప్రాంతాన్ని కప్పేడం, భారీగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News