Friday, December 20, 2024

వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వనస్థలిపురం: వనస్థలిపురం పనమా గోడౌన్ చౌరస్తలో గల విడెమ్స్ సిల్క్ విడమ్ ఫర్నిచర్‌లో శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని అందులోని విలువైన పట్టు చీరలు, విలువైన ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు ఫైరీంజన్ సిబ్బందికి సమాచారం అందచేయటంతోపాటు అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పక్కనే పలు షాపులోనికి మంటలు చేరకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవటంతో ఈ ప్రాంత ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనా స్థలాన్ని డిసిపి సాయిశ్రీ, వనస్థలిపురం ఇన్‌స్పెక్టర్ జలంధర్‌రెడ్డిలు ఎస్‌ఐలు పాల్గొన్నారు. సుమారు మూడు కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News