- Advertisement -
హైదరాబాద్: హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.ఘటన సమయంలో హోటల్ లో 40 మంది సిబ్బంది ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమదంలో హోటల్ నిద్రిస్తున్న 40 మంది సిబ్బందిని పోలీసులు కాపాడారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: నెల రోజుల పాటు ఎనిమిది రైళ్లు రద్దు..
- Advertisement -