- Advertisement -
ఎపిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఓ బాణసంచా కేంద్రంలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడి బాణసంచా కేంద్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు.. హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. గాయపడినవారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా సామర్లకోట వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.
- Advertisement -